పల్లవుల భక్తి పల్లవి - అంతర్వేది
రాజోలు కు 35 కిమీ దూరం లో పవిత్ర వశిష్టా నది సాగర సంగమం చేసే పుణ్య స్థలం అంతర్వేది. దక్షిణ కాశి గా ప్రసిద్ధి చెందింది. ముక్తిని ప్రసాదించే వైష్ణవ క్షేత్రం అంతర్వేది లో కొలువుదీరి , సఖల కలాభీష్టాలను నెరవేర్చేస్వామి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి.శిలా రూపంలో పశ్చిమ ముఖా ముఖంగా కోరికలానిదీర్చే స్వామి వారు ఉండడం ఈ క్షేత్ర విశిష్టత పిలిస్తే పలికే స్వామివారుగా భక్తులు విశ్వసిస్తారు.
సప్త సాగర యాత్రల్లో చిట్ట చివరి యాత్ర అంతర్వేది.బ్రహ్మ దేవుడు మహా రుద్రయాగం నిర్వహించిన పుణ్య వాటిక. యజ్ఞానికి వినియోగించిన యజ్ఞవేదిక మీద పార్వతి నీలకంటేశ్వరులను సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడు ఇక్కడ క్షేత్ర పాలకుడు శ్రీనీలకంటేశ్వరస్వామివారు.
వశిష్ఠ మహర్షి తన భార్యను , నూర్గురు పుత్రులను విడిచి సత్యలోకం వెళ్తాడు. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తలోచనుడు తన శరీరంలోని రాలిపడే ప్రతీ రక్త బిందువు నుండి ఒక్కొక్క రాక్షసుడు ఉద్బవించేలా శివుని వలన వరంపొంది యజ్ఞ యాగాది కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తూ సాదు జనులకు హింసించడమే కాకుండా , వశిష్ఠుని ఆశ్రమాన్ని ధ్యంసం చేసి ఆయన నూర్గురు పుత్రులను సంహరిస్తాడు.వశిష్ఠ మహర్షి ప్రార్ధనతో విష్ణుమూర్తి నరసింహ రూపంలో రక్తలోచనుడితో భీకరపోరు సాగిస్తాడు. కానీ శివ వరప్రభావం వలన రక్తలోచనుడి శరీరరక్తబిందువులనుండి అనేకమంది రక్తలోచనులు పుడ్తుండడంతో నరసింహస్వామి తన సోదరి అయిన గుర్రాలక్కను పిలిచి సహాయం అడుగుతాడు. అప్పుడు గుర్రాలక్క తననాలుకను పెద్దగా చాచి ఆ రాక్షసుని రక్తపు చుక్కలు నేలరాలకుండా నిలువరించగా స్వామి వారు ఆ రాక్షసుని సంహరిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి స్వామివారిని ఇక్కడే కొలువుదీరమని ప్రార్ధించగా ఆయన ప్రార్ధనతో స్వామివారు ఇక్కడే వెలిశారు. యాగార్ధమై చతురస్రముగా భుసింపబడిన భూమీపేరు. బ్రహ్మ యాగ నిర్వహణ గావించిన భూమికాబట్టి "అంతర్వేది" గా ప్రసిద్ధి పొందింది.