కోనసీమ వాసుల రెండో తిరుపతి అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దేవస్థానం

పురాతన రోజులలో ఈ స్థలం వేదాలలో బాగా చదవబడిన బ్రాహ్మణులకు పేరు గాంచింది, వారు శ్లోకాల పఠన మరియు గీతాలలో త్యాగం చేస్తూ త్యాగం చేస్తూ వారి సమయాన్ని వెచ్చిస్తారు

ఆలయ చరిత్ర

1960 ప్రాంతం లో ఈ గ్రామా వాసి అయిన శ్రీ మొల్లేటి రామస్వామి కొబ్బరి వ్యాపారం సాగిస్తూ తన వ్యాపార లాభాల్లో తిరుపతి వెంకన్నకు కూడా వాటా పెట్టారు. కొంతకాలం ప్రతీ సంవత్సరం తిరుపతి వెళ్లేవారు. కొన్ని అవాంతరాలేర్పడిన కారణంగా స్వామి వారిని దర్శించుకోలేకపోయి , స్వామి వారిని వేడుకొనగా , నీవు తిరుపతి రానక్కరలేదు నేనే స్వయంగా నీ గ్రామం లో కొలువుదీరుతానని స్వామి వారు కలలో సాక్షాత్కరించి చెప్పడం జరుగగా శ్రీ రామస్వామి సంతోషించారు.

అప్పుడు రామస్వామి చెక్కతో చేసిన స్వామి వారి విగ్రహాన్ని కొబ్బరి రాసుల మధ్య పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. కొంత కాలానికి , అనుకోకుండా ఆ కొబ్బరి రాసులు తగలబడిపోయాయి. మొత్తమంతా తగలబడిపోయినా స్వామి వారి చెక్క చేసిన విగ్రామ్ మాత్రం చెక్కు చెదరకుండా అలానే వుంది. అప్పుడు ఈ ప్రాంత వాసులు అందరు ఆశర్యపోయి , స్వామి వారే తాను ఇక్కడ వెలిసానని చెప్పడానికి ఇలా వైపరీత్యం కల్పించి ఉంటారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇదే కాకుండా , భక్తులు గుడి కడుతున్న సమయం లో ధ్వజ స్తంభం కోసం ఒక వ్యాపారి దగ్గరకెళ్ళి రేటు మాట్లాడారు, రేటు కుదరకపోవడం తో వారు వెనుదిరిగి వచ్చేసారు. మరునాడు ఉదయం ధ్వజస్తంభం వైనతేయ గోదావరి రేవులో కొట్టుకువచ్చింది. అప్పుడు భక్తులు అదే ధ్వజ స్తంభాన్ని గుడిలో ప్రతిష్టించారు. అప్పటినుండి అప్పుడప్పుడు స్వామి వారి లీలలు భక్తులు చూస్తూనే వున్నారు.

1970 దశకం లో రామస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1981 సంవత్సరం లో ఆలయాన్ని దేవాదాయశాఖ తన ఆధీనం లోకి తెచ్చుకుంది. 1991 జులై 4 న త్రిదండి శ్రీమన్నాయారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారిచే శ్రీ బాల బాలాజీ స్వామి వారి మూలవిరాట్ T T D సౌజన్యంతో నూతన ఆలయం లో ప్రతిష్టించారు. ప్రతీ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అన్నదానము ప్రవేశపెట్టిన మొట్ట మొదటి దేవాలయం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి దేవాలయం .

అప్పనపల్లి ఒక గ్రామమే అయినప్పటికీ, స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆహారం ,ఆశ్రమం ఉచితంగా అందించబడతాయి. యాత్రికులాయొక్క భధ్రత మరియు పవిత్ర గంగా స్నానాల తరువాత దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ,టాయిలెట్ రూమ్ లు , మొదలగు సౌకర్యాలు అందించబడతాయి

ఇప్పుడు అప్పనపల్లి , భక్తులను ఆకర్శించే రెండో తిరుపతి గా మారింది. ఆర్జిత సేవలు , మానవ జుట్టు, హండి అమ్మకాలు, వేలం ద్వారా విక్రయించడం వంటి వివిధ వనరుల నుండి వచ్చే ఆదాయం యాత్రికులకు మరింత సౌకర్యాలను కల్పించే ఉద్దేశ్యంతో ఉపయోగించబడుతుంది.

Appanapalli Bala balaji Devastanam Appanapalli Bala balaji Devastanam Appanapalli Bala balaji Devastanam Appanapalli Bala balaji Devastanam Appanapalli Bala balaji Devastanam Appanapalli Bala balaji Devastanam

పండుగలు

  • (జూన్) జ్యేష్ఠా శుద్ధ దశమి నుండి చతుర్దశికి స్వామివారి కళ్యాణమహోత్సవములు
  • ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారదర్శనం
  • విజయదశమిరోజు సాయంత్రం పద్మావతి అమ్మవారి కి లక్ష కుంకుమ పూజ
  • కార్తీక శుద్ధఏకాదశి రోజున స్వామి వారికి లక్ష తులసి పూజ
  • భోగి పండుగ రోజున అండల్ అమ్మవారికి లక్ష చామంతి పూజ

వసతి మొదలగు సౌకర్యాలకు

Assistant Commissioner and Executive Officer Sri Bala Balaji Devasthanam, Appanapalli, Mamidikuduru Mandal, East Godavari District. Phone No:08862-239562.