Z.P.B.HIGH SCHOOL RAZOLE
పూర్వం ప్రాథమిక పాఠశాలలో ఒకటి ,రెండు, మూడు తరగతులు ఆపైన నాలుగు, ఐదు 1st ,2nd & 3rd ఫారం వరకు లోయర్ సెకండరీ స్కూలు గా ఉండేవి.
రాజోలు లో 20వ శతాబ్దపు మొదట్లో ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉండేవి . లోయర్ సెకండరీ స్కూల్ 19 వ శతాబ్దం చివర నుండి శివకోడు గ్రామము లో ఉండేది. 1916 సంవత్సరము లో ఈ లోయర్ సెకండరీ స్కూల్ రాజోలు కు తరలించబడి హై స్కూల్ గా మారింది. గండికోట చలపతి రావు గారు మొదటి హెడ్ మాస్టర్ (1916 - 1920 ) గా పనిచేసారు. మొదట్లో ఈ స్కూల్ తాటి ఆకుల షెడ్ లో ఉండేది. ఈ షెడ్ ను ఎవరో తగలబెట్టడం తో ప్రస్తుతం వున్నా బాలికల హై స్కూల్ షెడ్ ల లో కి మార్చబడింది. ఈ షెడ్లు ఆఫీస్ మరియు లేబోరేటరీ లకు సరిపడకపోవడంతో కొంత కాలం పెద్దవంతెన వద్ద గల కోట్ల లోను , హై స్కూల్ ప్రక్కన ఒక బిల్డింగ్ నూ అద్దెకు తీసుకొనినడిపేవారు.
1948 నుండి పాత ఆంధ్రాబ్యాంక్ వద్ద గల రాజుగారి మేడ, ప్రక్కన గల యోగ క్లబ్ భవనం మొత్తం అద్దెకు తీసుకొని నడిపేవారు. 1961 వరకు చింతలపల్లి అల్లూరి సూర్యనారాయణరాజు గారి(పెద్దరాజు గారు ) ఈ భవనం లో అద్దెకు నడిపారు.
1950 వరకు ఈ హై స్కూల్ ఎక్కువ సంఖ్య విద్యార్థులతో నడిచేది. సఖినేటిపల్లి, పొన్నమండ, నగరం, గన్నవరం ప్రాంతాల నుండి హై స్కూల్ కి ఇక్కడికే రావాలి. అంతేగాక పశ్చిమగోదావరి జిల్లా లో అబ్బిరాజుపాలెం ,దొడ్డిపట్ల , మట్లపాలెం వగైరా గ్రామాలు నుండి కుడా వరదాలలోను , వర్షాలలోను రెండేసి రేవులు దాటి విద్యార్థులు సైకిల్ మీద, నడిచి వచ్చేవారు. వారు ఇక్కడ ఎవరీ ఇండ్లలోనో వారాలు చెప్పుకుని భోజనం చేసి సాయంకాలానికి ఇంటికి చేరుకునే వారు.
1950 నుండి ఈ హై స్కూల్ కు స్థలం సేకరించడానికి డా||ఆమంచి రామారావు గారు( డా||అప్పారావు గారి తండ్రి)అద్వర్యం లో ఒక కమిటీ ఏర్పడి సుమారు 30 వేలు సేకరించి ప్రస్తుతం జెడ్.పి బాలుర పాఠశాల వున్నా స్థలాన్ని సేకరించింది.
ఆ తర్వాత 1959 లో జిల్లాపరిషత్ ఏర్పడి ప్రస్తుత పెంకుటి భవనాలు నిర్మింపబడ్డాయి. అప్పటి జిల్లాపరిషత్ అధ్యక్షులు తోట రామస్వామి గారు వీటిని 1961 లో ప్రారంభించారు. అప్పటి వరకు వున్నా పాత భవనము లలో బాలికలకు ప్రత్యేకం గా హై స్కూల్ ఏర్పడింది. బాలుర హై స్కూల్ ప్రక్కనే 1983 లో బాలుర హాస్టల్ నిర్మింపబడింది.
- ప్రముఖ న్యాయవాది శ్రీ పొన్నాడ హనుమంత రావు గారు రాసిన నూరు వసంతాల రాజోలు పుస్తకం ఆధారంగా.